ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆన్‌లైన్ పాస్ తీసుకోవా లి

అనేక ప్రాంతాల నుంచి కేరళకు రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆన్‌లైన్ పాస్ తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయాణమవుతున్న ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ పాస్ తప్పనిసరని, ఒకవేళ ఎవరి వద్దనైనా పాస్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోనికి అనుమతించమని  స్పష్టం చేశారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే రాష్ట్ర వాసులందరూ తొలుత కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని పాస్ తీసుకోవాలని, ఆ తరువాతనే ప్రయాణానికి సిద్ధం కావాలని సూచించారు. ఈ పాస్ ద్వారా రాష్ట్రంలోకి  ఎవరెవరు వచ్చారో తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందని, ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కన్పించినా గుర్తించగలుగుతామని సీఎం తెలిపారు.