*అమరావతి*
పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్సా కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ*
*నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి*
కరోనా నివారణకు జరుగుతున్న పోరాటంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు
కఠినమైన సమయాల్లో కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తిస్తున్నారు.
పారిశుధ్య కార్మికుడికి వ్యక్తిగత రక్షణ కిట్లను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది
ఇప్పటికీ వారు తమ విధులకు హాజరవుతున్నారు.
చాలా సార్లు వారి సాధారణ పని గంటలను పొడిగిస్తున్నారు.
సిఆర్‌డిఎ గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు గత 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం ఆవేదన కలిగించే అంశం
పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి అనేక అభ్యర్ధనలు చేసినా పట్టించుకోలేదు.
సంక్షోభ సమయంలోనూ సమ్మెలో కూర్చోవడం వారి చివరి అస్త్రంగా మారింది.
పెనుమకా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన ను ఈ లేఖకు జత చేస్తున్నాను
వారికి తక్షణమే జీతాలు చెల్లించేలా చూడటం కర్తవ్యం.
సిఆర్‌డిఎ ప్రాంతంలోని పారిశుధ్య కార్మికుల బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా.