టీడీపీ నేతలకు ఆంక్షలు

కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ నేతలకు ఆంక్షలు విధించారు. శనివారం నగరంలో కేంద్రం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారిని కలిసేందుకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు వెళ్లారు. జిల్లాలో పరిస్థితిపై కేంద్ర బృందానికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని కలెక్టర్ కార్యాలయం అధికారులు అడ్డుకున్నారు. కేంద్రబృందాన్ని కలవకుండా ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు మెయిల్‌లో కేంద్ర బృందానికి వినతి పత్రం పంపించారు.