రాష్ట్రంలో పరిపాలనను పటిష్టం చేసేందుకు ఎపీ సర్కార్ మరో అడుగు

అమ‌రావ‌తి :


రాష్ట్రంలో పరిపాలనను పటిష్టం చేసేందుకు ఎపీ సర్కార్ మరో అడుగు


ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాలనలో సంస్కరణలు


దీనిని వ్యవస్థీకరించేందుకు జిల్లా స్థాయిలో కొత్త మార్పులు.


అభివృద్ధి.. సంక్షేమం... కోసం ప్రతి జిల్లాకు అదనంగా జాయింట్ కలెక్టర్ నియామకం....


తాజాగా సీనియర్ టైం స్కేల్ వున్న ఐఎఎస్ అధికారికి జెసి బాధ్యతలు


ముగ్గురు జెసిలు, వారు చేపట్టే విధులపై ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం


పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ప్రయత్నం.


గ్రామస్థాయికి పాలనను తీసుకువెళ్ళేందుకు కొత్త మార్పులకు శ్రీకారం.


జెసి (వి అండ్ డబ్ల్య ఎస్ )గా సీనియర్ టైం స్కేల్ ఐఎఎస్ అధికారులు.


కీలకమైన వార్డు, గ్రామ సచివాలయాల బాధ్యతలు   


సచివాలయాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ


పంచాయతీరాజ్, వైద్యం, కుటుంబసంక్షేమం, పాఠశాల, ఉన్నత విద్య, పట్టణాభివృద్ధి...


గృహనిర్మాణం, మీసేవా, ఆర్టీజి అండ్ ఐటిఇ అండ్ సి డిపార్ట్ మెంట్...


ఇరిగేషన్, ఎనర్జీ మినహా మిగిలిన అన్ని ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు


ఇప్పటి వరకు జెసి-1 గా వున్న పోస్ట్ ను జెసి- రైతుభరోసా, రెవెన్యూ (జెసి-ఆర్ అండ్ ఆర్) గా గుర్తింపు


వ్యవసాయం, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకారం...


పశుసంవర్థక, ఉద్యానవన, మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ..


రెవెన్యూ, సర్వే, విపత్తుల నిర్వహణ, ఇరిగేషన్...


శాంతిభద్రతలు, ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్, భూగర్భగనులు, ఎనర్జీ విభాగాలను పర్యవేక్షిస్తారు.


ఇప్పటి వరకు జెసి-2 గా వున్న పోస్ట్ ను జెసి-ఆసరా అండ్ వెల్ఫేర్ (జెపి-ఎ అండ్ డబ్ల్యు)గా గుర్తింపు


స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో భర్తీ.


గ్రామీణాభివృద్ధి (డిఆర్డిఎ, డ్వామా), మహిళా, శిశు సంక్షేమం...


బిసి, ఎస్సీ, ట్రైబల్, మైనార్టీ, డిసేబుల్డ్ వెల్ఫేర్...


పరిశ్రమలు, వాణిజ్యం, దేవాదాయశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు.


ముగ్గురు జేసిలకు జిల్లా కలెక్టర్ ప్రాతినిత్యం వహిస్తారు.


సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ కార్యకలాపాలను ముందుకు తీసుకువెడతారు.


సీనియర్ టైం స్కేల్ ఐఎఎస్ లకు జిల్లాస్థాయి పాలనలో భాగస్వామ్యంకు చక్కని అవకాశం.