తాడిపత్రిలో చికెన్ సెంటర్ లు బంద్.

తాడిపత్రిలో చికెన్ సెంటర్ లు బంద్.


తాడిపత్రి మున్సిపల్ అధికారులు ధర పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంతో  తాడిపత్రి వ్యాప్తంగా చికెన్ సెంటర్ లు బంద్ చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే పాలన విషయం లో చికెన్ ధరలు ప్రభుత్వం మారిన తరువాత చర్చనీయాంశం అయిన తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పాలనలో చికెన్ ధరలు 200 రూపాయల వరకు విక్రయాలు కొనసాగాయి. సామాన్యులకు ఈ విషయం భారంగా మారిందని మాజీ ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తారాస్థాయికి చేరుకుంది.  ప్రభుత్వం మారి సంవత్సర కాలం లో పట్టణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ప్లాస్టిక్ రహిత తాడిపత్రి ని మార్చే క్రమంలో పలు కఠిన ఆంక్షలు విధించారు. ఇది చవిచూసిన రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు తినుబండారాలకు అలవాటు పడిన వారిని అవకాశం గా మార్చుకొని ధరలను ఆకాశానికంటారు. లాక్ డౌన్ కాలంలో మాంసం ప్రియులకు చుక్కెదురైంది.kg చికెన్ 310 రూపాయలతో విక్రయాలు జరగనుండగా మునిసిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో చికెన్ సెంటర్  యజమానులు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది
ప్రజలు మాజీ ఎమ్మెల్యే పాలన ఎమ్మెల్యే పాలనలపై లెక్కలేసుకుంటూ వారి ఆలోచనల్లో నిమగ్నమయ్యారు.