అంఫన్ తుపాను  ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు అదనపు ఎన్‌డీఆర్ఎఫ్

అంఫన్ తుపాను 


ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు అదనపు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు@@update's 
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి అంఫన్ తుపానుగా రాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ తుపాను ప్రభావం అధికంగా పడే అవకాశం ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనంగా రెండు చొప్పున దళాలను పంపించింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. 
ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సాగర్ దీవి, కక్‌ద్వీప్, ఉలుబెరియా, హస్నాబాద్, ఆరాంబాగ్, దిఘాలలో మోహరించారు. 
భారత వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నెల 18-20 తేదీల మధ్య ఈ తుపాను ఉత్తర ఒడిశా తీరం, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను క్రమంగా బలపడుతోంది, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదులుతోంది.
బంగ్లాదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుపానుగా మారుతుంది. ఇది రెండు రోజుల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈ తుపాను నైరుతి దిశగా గంటకు 6 కి.మీ. వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుంది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి సోమవారం సాయంత్రం నుంచి  గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
దక్షిణ బంగాళాఖాతంలోకి వెళ్ళరాదని మత్స్యకారులను హెచ్చరించింది.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.