లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో


లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో


స్వంత గూటికి చేరుకుని అయిన తమ వారితో కలిసి కలో గంజో తాగైనా బతకొచ్చని, ఎంత కష్టమైనా  రాత్రనక పగలనక కాలినడకన సొంతూరు చేరుకోవాలనే లక్ష్యంతో ఎంతోమంది వలస కూలీలు నగరాలు పట్టణాల నుండి సొంతూరు బాట పట్టారు. 


కొంతమంది కోయంబత్తూర్ నుంచి అస్సాం వరకు నడిచే విధంగా నడక సాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోకి రావడం జరిగింది. రోడ్డు పక్కనే పడుకుంటూ దొరికింది తింటూ చిన్న బిడ్డలను చేతిలో పెట్టుకొని దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం లోకి నడుస్తున్న టువంటి వలస కూలీల పరిస్థితిని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. 


జాతీయ రహదారపై గుంపులు గుంపులుగా పిల్లా పాపలతో తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని రాత్రనక పగలనక మండుటెండను సహితం లెక్క చేయకుండా  వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్న    ముఖ్యంగా చెన్నై కొలకత్తా రహదారి మీద నడుస్తున్న వీరందరికీ ప్రత్యేక వసతులు కల్పించే విధంగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 


వీరందరినీ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ  shelter హోమ్ లకు తరలించడం జరుగుతుంది.


అక్కడ వారికి భోజన వసతితో పాటు అన్ని సదుపాయాలు కలిగించటం జరుగుతుంది. 


ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న టువంటి ప్రత్యేక వలస కూలీల ప్రత్యేక  రైళ్లలో వారి వారి నివాస స్థలాలకు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం వారి ఖర్చులతో పంపే విధంగా తగు చర్యలు చే పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది.


ఇప్పటివరకు 30 వేల మందికి పైగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వలస కూలీల ను వారి వారి స్వస్థలాలకు 28 ప్రత్యేక రైళ్లలో తరలించడం జరిగింది.


అదేవిధంగా రాష్ట్రం వచ్చే వారికి కూడా తగు సదుపాయం కలుగజేయడం జరిగింది.


అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నాలుగు వేల మంది  మత్స్యకారులను గుజరాత్లోని వెరవల్  అనే ప్రదేశం నుంచి 2000 km పైగా దూరం ఉన్న  శ్రీకాకుళం జిల్లాకు   రమారమి 60 బస్సుల్లో తీసుకు రావడం జరిగింది. 


చెన్నై నుండి  మరొక 1200 మంది మత్స్యకారులను శ్రీకాకుళం విజయనగరం లకు  తీసుకురావడం జరిగింది. 


పంజాబ్ లోని జలంధర్లో లాక్ డౌన్ వలన చిక్కుకుపోయిన రమారమి 1200 మందిని విజయవాడ కు తరలించడం జరిగింది. అలాగే వారణాసి, ముంబై,  అజ్మీర్, గోవా, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తెలుగువారి కి కూడా రాష్ట్రానికి తిరిగి రావటానికి తగిన అనుమతులు ఇవ్వటం జరుగు తోంది. 


లాక్ డౌన్ వలన చిక్కుకుపోయిన వలస కూలీల కు విద్యార్థిని విద్యార్థులకు మత్స్యకారులకు యాత్రికుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిని వారి వారి స్వస్థలాలకు తీసుకుని వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 


Popular posts