కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష

క్యాంప్‌ ఆఫీసులో కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు 1,65,069 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 3091 పరీక్షలు చేస్తున్నామని, ఏపీలో మరణాల రేటు 2.28శాతం ఉందని సీఎం పేర్కొన్నారు. కోయంబేడు మార్కెట్‌ వల్ల చిత్తూరు, నెల్లూరులో కేసులు పెరుగుతున్నాయని, కట్టడి ప్రాంతాల్లో ఉంటున్నవారికి ఎక్కువ పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. టెలిమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. విశాఖలో గ్యాస్‌లీకైన ప్రాంతంలో పశువులకు వైద్యం చేస్తున్నామని జగన్‌ తెలిపారు.