వాలంటీర్ కు  యశోద ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం

 వాలంటీర్ కు  యశోద ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం


ఊపిరితిత్తుల ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే వసంత..... 


ప్రస్తుత మందుల ఖర్చులకు సహాయం చేస్తాని ముందుకొచ్చిన పాలడుగు.... 


ఇబ్రహీంపట్నం 2వ  సచివాలయలో వాలంటీర్ గా పని చేస్తున్న ఉప్పతల వర్దిని ఆరోగ్య సమస్య గురించి తెలిసిన నాటి నుండి  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆమె బందువులకు ప్రతి రోజు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.  ఇటీవల ప్రజాశక్తి  IBM న్యూస్ 24/7 న్యూస్ గ్రూప్ ద్వారా వాలంటీర్ ఆరోగ్య సమస్య పై కథనం రాయడం జరిగింది..  దింతో అప్పటికప్పుడు స్పందించిన ఎమ్మెల్యే వసంత ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు నాది భాద్యత అని హామీ ఇచ్చారు..  అప్పటి నుండి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులను కూడా ఇప్పటికే సంప్రదించి ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని సిద్దము చేశారు..  అయితే ప్రస్తుతం ఆమె బాగా బలహీనంగా ఉందని ఆమె పోషకాహారాలు అందించి నెల రోజుల పాటు మందులు వాడాలని వైద్యులు సూచించడం తో ఆమెను భవానీపురం వాళ్ళ అమ్మ గారి ఇంట్లో విశ్రాంతి తీసుకొంటోంది.  లాక్ డౌన్  కారణంగా ఇప్పటికే  ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి  మందులు కోసం వారానికి 12 వేలు మేర ఖర్చు అవుతుంది. అంతేకాకుండా  పోషకాహారం తీసుకునే పరిస్థితి లేదు అయితే అవి కూడా  చూసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. ఈ క్రమంలో  ప్రస్తుతం ఆమె కుటుంబం పడుతున్న అవస్థను పరిగణం లోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం మండల వైసీపీ నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్ ముందుకొచ్చారు..  ఆమెకు మందులు సమకూర్చుకునేందుకు ఆర్ధిక సాయంతో పాటు 50 కేజీ ల బియ్యం పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ  కుటుంబానికి ఇంకా సాయం అందించే దాతలు ఉంటే సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
వైసీపీ లో చేరికలు