మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. 


             


 మద్యం ధరల పెరుగుదల దశల వారీ  మద్యం  నిషేధం లో భాగమే. 
      ----- మద్య విమోచన ప్రచార కమిటీ.


 పాదయాత్రలో, నవరత్నాల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దశలవారీ మద్యనిషేధం ఆచరణాత్మక అమలు ప్రణాళికలో భాగమే నేడు మద్యం ధరలు పెంచడమని  మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రకటించిన దశలవారీ మద్యనిషేధం అమలులో భాగంగా ఇప్పటి వరకు ప్రవేట్ మద్యం షాపులను తొలగించి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించుట,  గతంలో ఉన్న 4,380 షాప్ లను నేడు 2,900 షాప్ లకు తగ్గించుట,  బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించడం, పర్మిట్ రూములను తొలగించడం,మద్యం విక్రయించే సమయాన్ని కుదించడం, మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం,మద్యం ధరలను పెంచడం,డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మద్య నిషేధం లో భాగమే.తదితర చర్యలను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, వామపక్ష పార్టీలు గానీ, మహిళా సంఘాలు గాని స్వాగతించకపోవడం శోచనీయం.ఈ  చర్యల ఫలితంగా మద్యం  వినియోగం 30%, బీరు వినియోగం 60% తగ్గిందని రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనూ పేర్కొన్న విధంగా మద్యం ధరలను  షాక్  కొట్టేలా పెంచుతూ మధ్య వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో మద్యం షాపులను ప్రారంభిస్తే అదేదో ఒక ఆంధ్రప్రదేశ్ 
లో  మద్యం షాపులను తెరిచినట్లు ప్రతిపక్ష పార్టీలు,మహిళా సంఘాలు, విమర్శించడం తగదన్నారు. గొడుగులు,మాస్కులు ధరించి క్రమశిక్షణతో భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం విక్రయాలు జరిగే విధంగా అధికార యంత్రాంగం చూడాలన్నారు. ధరలు పెరగడం వలన నాటుసారా,గంజాయి,  కల్తీకల్లు వంటి మత్తు పదార్థాల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని వాటి నివారణకు ఎక్సైజ్ సిబ్బంది తోపాటు పోలీస్,రెవెన్యూ విభాగాల భాగస్వామ్యం పెరగాలన్నారు.ఏ రాజకీయ జోక్యం  ఉండరాదన్నారు.గత పది నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తూ మద్యం వినియోగం పేద వర్గాల్లో పెరగాలని కోరుకోవడం సహేతుకం కాదన్నారు.గతంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేసి, బెల్టు షాపులకు శ్రీకారం చుట్టడం తన పాలనలో మద్యoధ్రప్రదేశ్  గా మార్చడం జరిగిందని గుర్తు చేశారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ  మద్యనిషేధం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా అమలై ఆంధ్రప్రదేశ్ మద్య రహిత రాష్ట్రంగా రూపొందగలదని లక్ష్మణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.