గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ వలన ఇబ్బందులకు గురి అవుతున్న పాత్రికేయులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. శనివారం కలక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరం వద్ద గుంటూరు నగరంలో పని చేస్తున్న పాత్రికేయులకు 10 కిలోల బియ్యం, ఒక కె.జి కందిపప్పు, ఒక కె.జి ఆయిల్ ప్యాకెట్, కూరగాయలతో కూడిన కిట్లను జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పాత్రికేయులకు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, లాక్ డౌన్ వలన పాత్రికేయులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి వారికి జిల్లా యంత్రాంగం తరపున నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ, ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ అబ్దుల్ రఫీక్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శివరామ ప్రసాద్, కలక్టరేట్ ఏ.ఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు లోని పాత్రికేయులకు కలెక్టర్ సహాయము