వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌

*‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌*
కరోనా నియంత్రణకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే టెలికం కంపెనీలు.. ఇళ్ల నుంచి పనిచేసే వారికి ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీలను ప్రకటించాయి.
తాజాగా టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటాను అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇతర జియో ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ నంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజువారీ 100 ఎస్సెమ్మెస్‌లు అదనం. ఇతర నెట్‌వర్క్‌ నంబర్లకు 3,000 వాయిస్‌ కాలింగ్ నిమిషాలు ఈ రీఛార్జీతో లభించనున్నాయి. అంతే కాకుండా జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. జియో ఇప్పటికే రూ.599 రీఛార్జీతో రోజువారీ 2జీబీ డేటా, రూ.555 రీఛార్జీతో 1.5జీబీ డేటా ప్లాన్లు 84 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ ఇళ్ల నుంచి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.