న్యూఢిల్లీ :
ఎన్జీటి ఎంటరయ్యింది.. ఇక ఎల్జీ పాలిమర్స్ కి, ఎపి సర్కార్ కి కష్టమే
★ మరణాల సంఖ్యను, జగన్ పరిహారాన్ని చూసి ఈ సమస్య సమసిపోయింది అనుకుంటున్నారు కొందరు.
★ కథ ఇపుడే మొదలైంది. ఇది అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన పెద్ద సమస్య.
★ ఈ కేసును ఎంత మంది చనిపోయారు అన్న కోణంలో డీల్ చేయరు. ఇది తరతరాలను, ఒక ప్రాంతాన్ని నాశనం చేయగలిగిన సమస్యగా పర్యావరణ నియంత్రణ సంస్థలు భావిస్తాయి. ఆ కోణంలోనే విచారణ చేస్తాయి.
★ మానవహక్కుల సంఘం రంగంలోకి దిగి జగన్ కు చెమటలు పట్టించింది.
★ తాజాగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ దుర్ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెంటనే స్థానిక కోర్టులో 50 కోట్లు డిపాజిట్ చేయమని ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్ ను ఆదేశించింది.
★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ సర్కారుకు, ఎల్జీ పాలిమర్స్ కు, సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.
★ అసలు సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలతో హాజరు కావాలని, సమస్య అనుపానులు మొత్తం సమర్పించి దాంతో పాటు ఘటనపై దర్యాప్తు నివేదిక అందివ్వాలని ఆదేశించింది.
★ ఎన్జీటీ ఛైర్ పర్సన్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ తదుపరి దీని గురించిన విచారణ, దర్యాప్తు, పరిశీలన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని బి శేషశయనరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసింది.
★ మే 18లోపు ఈ సంఘటనపై దర్యాప్తు చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది.
★ రూ.50 కోట్లు స్థానిక కోర్టులో డిపాజిట్ చేయడంతో పాటు ఎన్జీటీ తదపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని, కంపెనీ సామర్థ్యం, భవిష్యత్తు వీటన్నింటి మీద దర్యాప్తు అనంతరం నిర్ణయాలు వెల్లడిస్తామని ఎన్జీటీ పేర్కొంది.
★ _*ఇది కేవలం కొన్ని ప్రాణాలను తీసిన దుర్ఘటనగా చూడలేం. ఇది ప్రకృతి మీద దాడి. పాడి, పంట, నేలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. పరిసర ప్రాంతాల భవిష్యత్తును చిద్రం చేసింది*_ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది.
★ దేశంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అత్యున్నత పర్యావరణ నియంత్రణ సంస్థ.
★ దేశంలో అన్ని పరిశ్రమలు దీని నిర్ణయాలకు, తీర్పుకు కట్టుబడి ఉండాల్సింది.
★ ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కాదు కదా, సాగునీటి ప్రాజెక్టులు కూడా నడపలేం.