విశాఫట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ నేపథ్యంలో.....

 


విశాఫట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ నేపథ్యంలో


చోటుచేసుకున్న పరిస్ధితులపై రాజకీయ నేతలంతా స్పందిస్తున్నారు. పరిస్ధితిపై ఇప్పటికే స్ధానిక నేతల నుంచి సమాచారం తీసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు వీలైతే నగరానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో సీఎం జగన్ విశాఖ బయలుదేరుతుండగా... విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే బాటలో ఉన్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం అనుమతి కోరారు.
లాక్ డౌన్ ప్రారంభం కాగానే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు... ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ఆయనకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తాను విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని చంద్రబాబు కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు హోంశాఖ అనుమతించింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రుల పరామర్శకు ఆసుపత్రికి వెళ్లనున్నారు.