ఇప్పుడు చెప్పండి సార్..కాస్త ఆలోచించండి సార్..!

అయ్యో! టీచర్ సార్..సిగ్గుపడుతున్నారా “సార్” !


“గవర్న్‌మెంట్ టీచర్స్ ను మద్యం షాపుల వద్ద డ్యూటీ చెయ్యమన్న..సర్కార్..!”
“ఇలా పని చెయ్యడం సిగ్గుగా ఉంది అని బాధపడుతున్న టీచర్స్..!”


అయ్యా టీచర్ గారు…క్షమించమని అడగమంటారా? లేక మీకు మీరే ఆత్మ క్షమాపణ కోరుకుంటారా?


ఎవరు సార్ మీ ఈ స్థితికి కారణం? ఎవరంటారా మీ ఈ దుస్థితి ని అనుభవించడానికి అసలు కారణం..


ఒక్కసారి ఆలోచించండి “సార్”! మీరు కాదా? మీరే కదా!


మిమ్మల్ని కన్నతల్లి లాంటి పల్లెల రుణం తీర్చుకోండి..అందరం కలసి పని చేద్దాం రండీ అని..ఒక నాయకుడు అంటే..


ఆయనపై ‘నరకం చూపించేస్తున్నాడు’ ..అన్నారు..మాట్లాడితే చెట్లు నాటమంటున్నాడు..మొక్కలకు నీళ్ళు పొయ్యమంటున్నాడు..అన్నారు..ఊరిని బాగు చెయ్యమంటున్నాడు..అంటూ రక రకాల విమర్శలు చేశారు..


‘అమ్మ’లాంటి పల్లెను కాపడమన్న పాపానికి..ఆ ‘అమ్మ’తో మొదలు పెట్టి మరీ బూతులు తిట్టారు..
కట్ట కట్టుకుని..అంతా ఒకటై..అతన్ని కాదన్నారు..రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది అని తెలిసినా..ఆయన్ని ప్రజలకు దూరం చేశారు..


మొన్నటికి మొన్న బయో మెట్రిక్ విధానం వల్ల..మీ ఆటలు సాగడం లేదని.. నేనొస్తే దీన్ని తీసేసి మీ విచ్చల విడి తనానికి స్వతంత్రం కల్పిస్తాను అని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్ద అనగానే..తెల్లవార్లు క్యూ లైన్ ల లో నిలబడి మరీ ఎన్నుకున్నారు…


ఇప్పుడు ఈయన మిమ్మల్ని మందు షాపుల దగ్గర డ్యూటీ చెయ్యమంటున్నాడు..
“మందు బాబుల క్యూ లైన్ లని కంట్రోల్ చెయ్యమంటున్నాడు..


ఇప్పుడు చెప్పండి సార్..కాస్త ఆలోచించండి సార్..!


మొక్కలు నాటమంటే నామోషీగా ఫీల్ అయిన మీరు..
ఈ రోజు..మందు వాసన మధ్య డ్యూటీ చెయ్యడం బావుందా సార్?


ఊరు బాగు చేసుకోమంటే…అతని పాలనపై ఉరిమి..ఉరిమి పడిన మీరు..
ఈరోజు..మందు బాబుల ఉమ్ముల మద్య ఈ ఊడిగం చెయ్యడం సమ్మగా ఉందా సార్?


ఇప్పటికైనా అర్ధం అయ్యిందా టీచర్ గారు?
సమర్ధుడు ఆలోచన విధానానికి..అసమర్ధుడి..అనాలోచిత ఆలోచనలకి..! సమర్ధుడి ముందు చూపుకి..అసమర్ధుడి మంద బుద్దికి!


కళ్ళు తెరవండి సార్..పాఠాలు చెప్పి..భావి తరాల భవితకు మార్గం దిద్దాల్సిన వాళ్ళు..! ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఉన్నారో..ఉండాల్సి వచ్చిందో..ఆలోచించుకోండి..ఆత్మ విమర్శ చేసుకోండి..


ఇకనైనా మారండి! గురువు కూడా దైవంతో సమానం అన్న మాటను అపహాస్యం చెయ్యకుండా..”గురువే దైవం”గా అందరూ భావించేలా బ్రతకడానికి ట్రై చెయ్యండి..!


 ఇది పనినే దైవంగా భావించే గురువులకు కాదు..కేవలం పనిని భారంగా భావించి..భావి తరాల భవిష్యత్తుని ఇరకాటంలో పెడుతున్న బద్దకస్తపు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు.