హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో గల డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ శనివారం స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక కాలనీల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, కాలుష్యం, నీటి కలుషితంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులకు తమ ఇబ్బందులు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన