ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. 

 


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. 


 


గొల్లపూడి లో ఇటీవల తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసిన మాజి  ఎంపీటీసీ ,జిల్లా ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షులు బొర్రా తిరుపతిరావు గారు ఈ రోజు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాదు గారిని వారి నివాసంలో కలిసి వారి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.శాసనసభ్యులు గొల్లపూడి పార్టీ నాయకులు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.*


ఈ సందర్భముగా బొర్రా తిరుపతి రావు మాట్లాడుతూ
 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ,వాటి అమలు పట్ల  రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తి ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు
కరోనా విజృంభించిన ఈ సమయంలోను పేదలకు ముఖ్యమంత్రి గారు అందజేసిన 1000 నగదు, ఉచిత రేషన్, పేదలను ఎంతో ఆదుకుందని తెలిపారు.ప్రజా సంక్షేమం,సంక్షేమ పథకాల అమలు విషయంలో ముఖ్యమంత్రి దృఢ చిత్తానికి ఆకర్షితుడై వైసీపీ లో చేరానన్నారు.
శాసనసభ్యులు శ్రీ కృష్ణ ప్రసాదు గారు సంవత్సర కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇప్పటివరకు ఎవరు చేయలేనంత అభివృద్ధి పనులు సాధించారన్నారు.
నియోజక వర్గ అభివృద్ధి విషయంలో చరిత్రను తిరగ రాయగలిగే సత్తా ఒక్క కృష్ణ ప్రసాదు గారికే ఉందన్నారు.


రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన ఈ సమయంలో ప్రజలు, దేశం లోని మేధావులు అంతా  జగన్మోహనరెడ్డి గారిని సమర్ధిస్తుంటే స్వయంకృతాపరాధాలతో నిస్సహాయస్థితిలో ఉన్న టీడీపీ ప్రజా సంక్షేమం పట్టక అధ్యక్షుడితో సహా ఇంటినుండి బయటికి రాకుండా బురద జల్లే కార్యక్రమం చేస్తుందని,
ఘోర పరాజయం తరువాత కూడా టీడీపీ లోని నియంతృత్వ నాయకులు గుణపాఠం నేర్చుకోలేదన్నారు.


గొల్లపూడి  టీడీపీ లో కొందరు నేతలు అధికారం పోగానే  అధికారపార్టీలో చేరేందుకు ప్రయత్నించగా వీరి వెన్నుపోటు తత్వాన్ని,వీరిని ప్రజలు  తిరస్కరించడాన్ని గమనించిన అధికార పార్టీ తలుపులు మూసివేయడంతో ఇప్పుడు  పోటీచేస్తున్న అభ్యర్థులతో తమకు అధికార పార్టీ లో పలుకుబడి ఉందని మిమ్మల్ని గెలిపించి మనందరం  అధికార పార్టీలో చేరుదామని ఆశచూపి  కొందరితో బలవంతంగా   పోటీచేయించినట్టు టీడీపీ పార్టీ లో కొందరు అనుకుంటున్నారని ఇలాంటి వెన్నుపోటు   పరిణామాలతో విసిగి రాజీనామా చేశానని అన్నారు. టీడీపీలో ఉంటే వారిచ్చే పదవుల కన్నా ప్రజలు  మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి,శాసనసభ్యుల  తరపున ప్రజల కోసం  ఏ పదవి లేకపోయినా పనిచేయడమే.
ఆనందంగా ఉంటుందన్నారు.


గొల్లపూడి వైఎస్సార్ పార్టీలో ఐక్యత ఉందని,  
అందరితో కలిసి పనిచేస్తానని తెలిపారు.


శ్రీ తలశీల రఘురాం గారి పట్ల విధేయుడనై ఉంటానని వారి అదేశాలమేరకు పనిచేస్తానని తెలిపారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ కారంపూడి సురేష్,ఆలపాటి సుబ్బారావు,జాస్తిజగన్,చిట్టినేని శ్రీనివాసరావు,వేమూరి సురేష్,బొర్రా వెంకట రావు దనేకుల చౌదరి నామాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో